Politics17th Oct 12:44 PMSunil Byrisetty1 min read

పక్క రాష్ట్రాల గూండాలతో దాడులు

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి జగన్, వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. పక్కరాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి, టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడుతున్న

పక్క రాష్ట్రాల గూండాలతో దాడులు
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి జగన్, వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతున్నారు. పక్కరాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి, టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. ఎంపీ మిధున్ రెడ్డి వీధి రౌడీలా వ్యహరించారు. గొడ్డలి పార్టీ నాయకులు ఎన్ని బెదిరింపులకు, దాడులకు పాల్పడినా భయపడేది లేదు.. పులివెందుల సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయబోతున్నాం..’ అని మంత్రి ఎస్.సవిత ధీమా వ్యక్తంచేశారు. పోలీసులు పూర్తి స్వేచ్ఛతో విధులు నిర్వర్తిస్తున్నారని స్పష్టం చేశారు. ఒకవైపు ఈడీ దాడులు, మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసు వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపుతుండడంతో జగన్ లో ఆందోళన మొదలైందన్నారు. త్వరలో వైసీపీ క్లోజ్ అవ్వడం ఖాయమని మంత్రి సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల ప్రారంభమైన మొదటిరోజే వైసీపీ నాయకులు పెట్రేగిపోయారన్నారు. పక్కరాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారన్నారు. తిరుపతి, రాయచోటి, పుంగనూరు, ధర్మవరంతో పాటు పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు.
Scroll for the next article