News28th Aug 08:33 AMSunil Byrisetty1 min read
మంత్రి లోకేష్ కు రాఖీ కట్టిన మంత్రి, ఎమ్మెల్యే!
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో వేడుక నిర్వహించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రా
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో వేడుక నిర్వహించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగింటి ఆడపడుచులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు లేని తనకు ఆంధ్ర రాష్ట్ర సోదరీమణులంతా సొంతవారేనన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత, ఎమ్మెల్యే మాధవికి చీర, సారె అందించారు.