News11th Jan 01:09 PMSunil Byrisetty1 min read
చేనేతలకు మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త
చేనేత సహకార సంఘాలకు మంత్రి సవితమ్మ సంక్రాంతి పండుగ వార్త చెప్పారు. రూ.5 కోట్ల బకాయిల విడుదలకు మంత్రి సవిత ఆదేశం ఇచ్చారు. మంత్రి సవిత ఆదేశాలతో బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయం తీసు
చేనేత సహకార సంఘాలకు మంత్రి సవితమ్మ సంక్రాంతి పండుగ వార్త చెప్పారు. రూ.5 కోట్ల బకాయిల విడుదలకు మంత్రి సవిత ఆదేశం ఇచ్చారు. మంత్రి సవిత ఆదేశాలతో బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయం తీసుకుంది. రేపు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో రూ.5 కోట్ల బకాయిల జమ కానున్నాయి. గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలను ఆప్కో చెల్లించింది. ఈ నిర్ణయంపై మంత్రి సవితకు చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు ధన్యవాదాలు తెలిపారు.