News14th Jan 10:47 AMSunil Byrisetty1 min read
*భోగి మంటలు వేసిన మంత్రి సవిత*
పెనుకొండ స్వగృహంలో భోగి మంటలు వెలిగించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత . కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటల చుట
పెనుకొండ స్వగృహంలో భోగి మంటలు వెలిగించిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత . కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా భోగి వేడుకల్లో పాల్గొన్నారు.
భోగి మంటల చుట్టూ చేరిన ప్రజలకు మంత్రి సవిత భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని, కొత్త ఆశలు, కొత్త శుభారంభాలకు ఇది ప్రతీక అని పేర్కొన్నారు. రైతుల కష్టఫలితానికి గుర్తుగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనందకరమని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.