Politics27th Aug 05:20 PMSunil Byrisetty1 min read
సీమ సాగునీటి ప్రాజెక్టులసై బహిరంగ చర్చకు రెడీ
రాయలసీమను సీఎం చంద్రబాబు సస్యశ్యామలం చేస్తున్నారని, ఆయన హయాంలోనే సీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారని మంత్రి ఎస్.సవిత తెలిపారు. రెండేళ్లలో హంద్రీ-న
రాయలసీమను సీఎం చంద్రబాబు సస్యశ్యామలం చేస్తున్నారని, ఆయన హయాంలోనే సీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారని మంత్రి ఎస్.సవిత తెలిపారు. రెండేళ్లలో హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు 50 టీఎంసీల కృష్ణా జలాలను తరలించామన్నారు. వైసీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టులకు రూ.2,011 కోట్లే ఖర్చు చేశారని, 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ.12,500 వెచ్చించిందని గుర్తుచేశారు. రాయలసీమ ప్రాజెక్టుల గురించి వైసీపీ నాయకులకు మాట్లాడే అర్హత లేదన్నారు. 2014-19 మధ్య రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు వెచ్చించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రూ.6,600 వేల కోట్లకుపైగా ఖర్చు చేశారన్నారు. ఈ రెండేళ్ల కాలంలో హంద్రీ - నీవా ద్వారా రాయలసీమకు 52 టీఎంసీల నీటిని తీసుకొచ్చామన్నారు. 19 నియోజక వర్గాల్లో ఉన్న 420 చెరువులను నీటితో నింపామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి సవిత తెలిపారు. వైసీపీ నాయకులను స్పష్టం చేస్తున్నానని, రాయలసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని మంత్రి సవిత సవాల్ చేశారు.