Education2nd Sep 02:35 PMSunil Byrisetty1 min read

బీసీ బాలికల కళాశాలలో శానిటరీ కిట్ల పంపిణీ

విజయవాడలోని గుణదల బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి సవిత శానిటరీ కిట్లు పంపిణీ చేశారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం

బీసీ బాలికల కళాశాలలో  శానిటరీ కిట్ల పంపిణీ
విజయవాడలోని గుణదల బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి సవిత శానిటరీ కిట్లు పంపిణీ చేశారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. హాస్టళ్లు, గురుకులాలు, వాటి పరిసరాలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బీసీ హాస్టళ్లలో 1,200 మంది పారిశుధ్య సిబ్బందిని నియమించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీపీ హాస్టళ్లకు రూ.6 కోట్ల విలువైన శానిటరీ కిట్లు అందజేస్తున్నామని వివరించారు. ఒక్కో కిట్ లో 11 రకాల ఐటమ్స్ ఉంటాయని పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల రక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఈ ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని మంత్రి సవిత అన్నారు. విద్యార్థినులు వినతి మేరకు గుణదల హాస్టల్ లో గ్రంథాలయం ఏర్పాటుకు మంత్రి సవిత హామీ ఇచ్చారు.
Andhra Pradesh
Sanitary Kits
BC Girls College
Gunadala
Vijayawada
Minister Savitha
BC Welfare
BC Hostels
BC Gurukuls
Girl Students
Student Health
Women’s Health
Hygiene
సీసీ కెమెరాలు
విద్యార్థుల భద్రత
రూ.6 కోట్ల శానిటరీ కిట్లు
గ్రంథాలయం
విద్య
Scroll for the next article