News22nd Dec 03:53 PMSunil Byrisetty1 min read
‘ముస్తాబు’ను పరిశీలించిన మంత్రి
విద్యార్థులు బాగా చదువుకోవడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. సోమవారం మోపిదేవిలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబ
విద్యార్థులు బాగా చదువుకోవడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. సోమవారం మోపిదేవిలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల, బీసీ సంక్షేమ వసతి గృహాలలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన అద్దం, దువ్వెన, చేతులు శుభ్రం చేసుకొనే వాష్ బేసిన్ మంత్రి పరిశీలించారు. తదుపరి పాఠశాల, వసతి గృహాలను పరిశీలించారు. విద్యార్థుల దగ్గరకు వెళ్లి వారి వ్యక్తిగత పరిశుభ్రతను, చేతి గోర్లు తీసుకుంటున్నారా లేదా గమనిస్తూ, ఏం చదువుతున్నారు, ఏకరూప దోస్తులు ఎలా ఉన్నాయి? భోజనం ఎలా ఉంటుంది, ఎలా చదువుకుంటున్నావు? తల్లికి వందనం అందుతుందా లేదా ఆరోగ్యం ఎలా ఉంది, ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని అల్పాహారం, చిక్కి రుచి చూశారు. పులిహోర సరిగా చేయడం లేదని, మరింత మెరుగ్గా ఆహారం తయారు చేయాలని మంత్రి వంటవారిని ఆదేశించారు.