Spiritual15th Nov 11:58 AMSunil Byrisetty1 min read
దుర్గమ్మ సేవలో మహిళా మంత్రి
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను మంత్రి సవిత దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపీ ఈశ్వర్, ఇతర కూటమి నాయకులు పాల్గొన
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను మంత్రి సవిత
దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపీ ఈశ్వర్, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.
మంత్రి సవితకు పాలకమండలి సభ్యులు, దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. తనయుడితో కలిసి అంతరాలయంలో మంత్రి సవిత ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సవితకు ఆశీర్వచనాలు, అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడిన మంత్రి సవిత దుర్గ గుడిలో సౌకర్యాల కల్పనపై ఆరా తీశారు.
భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంపై మంత్రి సవిత ఆనందం వెలిబుచ్చారు.