Politics8th Dec 02:55 PMSunil Byrisetty1 min read
పరకామణి చోరీ 'చిన్న తప్పా'? జగన్‌పై మండిపల్లి విమర్శ
వైసీపీ అధ్యక్షుడు జగన్ పరకామణి చోరీ కేసును 'చిన్న చోరీ'గా తగ్గించి మాట్లాడటం అనుచితమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. గంజాయి సరఫరాదారులైన కొండారెడ్డి వంట
వైసీపీ అధ్యక్షుడు జగన్ పరకామణి చోరీ కేసును 'చిన్న చోరీ'గా తగ్గించి మాట్లాడటం అనుచితమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. గంజాయి సరఫరాదారులైన కొండారెడ్డి వంటి వారిని కూడా జగన్ వెనకేసుకొస్తున్నారంటూ మండిపడ్డారు. చిన్న పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసినవారిని అమాయకులుగా చూపిస్తున్నారని విమర్శించారు. వైసీపీ చర్యల వల్ల రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని, కూటమి ప్రభుత్వంలో ఇవాళ పెట్టుబడులు క్యూకడుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. తిరుమల పరకామణి కేసులో చోరీ చేసిన వ్యక్తి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ రూ.14 కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి సమర్పించినప్పటికీ, జగన్ 'చిన్న తప్పు' అని చెప్పి కేసును తగ్గించడం ద్వారా భక్తుల భావాలను గాయపరుస్తున్నారని ఆరోపించారు.