News1st Sep 11:17 AMSunil Byrisetty1 min read

పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం, కృష్ణాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 63.61 లక్షల మందికి పెన్షన్లను ప్రభుత

పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం, కృష్ణాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 63.61 లక్షల మందికి పెన్షన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పెన్షన్ల కోసం రూ. 2,746.52 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. విజయనగరం జిల్లాలో 2.76 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ జరుగుతోంది. జిల్లాలో సామాజిక పెన్షన్ల కోసం రూ. 117 కోట్లు ఖర్చు చేస్తుంది.. దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని మంత్రి వెల్లడించారు. కొత్తగా మంజూరైన 7,872 స్పౌజ్ పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
Andhra Pradesh Government
Pension Distribution
Vizianagaram
Gajapathinagaram
Krishnapuram
Minister Kondapalli Srinivas
ఆర్థిక సహాయం
స్పౌజ్ పెన్షన్లు
దివ్యాంగుల పెన్షన్లు
Scroll for the next article