News14th Dec 04:02 PMSunil Byrisetty1 min read

కాపు కళ్యాణమండపం ప్రారంభించిన మంత్రి సుభాష్

రామచంద్రపురం రూరల్ అన్నయ్యపేట గ్రామంలో నిర్మించిన కాపు కళ్యాణ మండపాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ కళ్యాణ మ

కాపు కళ్యాణమండపం ప్రారంభించిన మంత్రి సుభాష్
రామచంద్రపురం రూరల్ అన్నయ్యపేట గ్రామంలో నిర్మించిన కాపు కళ్యాణ మండపాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ కళ్యాణ మండపంలో భోజనశాల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి గతంలో ఎంపీ సుభాష్ చంద్రబోస్ తన నిధుల నుంచి రూ. 30 లక్షలు, అప్పటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు రూ.25 లక్షలు మంజూరు చేశారని పలువురు కాపు నాయకులు వెల్లడించారు. భోజనశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు హామీ ఇచ్చిన మంత్రి సుభాష్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత కాపు నాయకుడు దివంగత వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Kapu Kalyana Mandapam
Minister Vasanthasetti Subash
Ramachandrapuram Rural
Annayyapeta Village
Kapu Community
భోజనశాల నిర్మాణం
ఎంపీ సుభాష్ చంద్రబోస్
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
Scroll for the next article