News8th Aug 03:09 PMSunil Byrisetty1 min read
మాట నిలబెట్టుకున్న మంత్రి సుభాష్
కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామం తోటకాలనీకి చెందిన ఓ నిరుపేద మహిళ సుందరపల్లి జ్యోతి తన ఇద్దరు కుమార్తెలు సుందరపల్లి సత్య, అనూషలతో నిలవడానికి గూడు లేక చిన్న ప్లాస్టిక్ డేరా కట్టుకున
కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామం తోటకాలనీకి చెందిన ఓ నిరుపేద మహిళ సుందరపల్లి జ్యోతి తన ఇద్దరు కుమార్తెలు సుందరపల్లి సత్య, అనూషలతో నిలవడానికి గూడు లేక చిన్న ప్లాస్టిక్ డేరా కట్టుకుని బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. జ్యోతి భర్త శేషారావు ఇటీవల కాలంలో బలవన్మరణం పొందారు. ఇంటి పెద్దదిక్కు, ఉపాధి కోల్పోయిన ఆ కుటుంబం దీన స్థితిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పేరిట కూటమి ప్రభుత్వం ఇంటింటా ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కి ఆ నిరుపేద కుటుంబం తారసపడింది. ఆమె కష్టాలు విన్న మంత్రి చలించిపోయారు. ఆ పేద మహిళలకు గూడు నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. త్వరలోనే మీ ఇల్లు నిర్మిస్తానని, ఇరువురు కుమార్తెలకు ఉపాధి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో మంత్రి సుభాష్ గొల్లపాలెం వెళ్లి గ్రామ ప్రజల సమక్షంలో ఆ కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేసి, నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకూ ఆ కుటుంబాన్ని వేరే అద్దె గృహంలో ఉంచి, నెలవారి అద్దె
తానే చెల్లిస్తానన్నారు.