News30th Sep 11:58 AMSunil Byrisetty1 min read
చిన్నారి వైద్యానికి మంత్రి సుభాష్ సాయం
మంత్రి సుభాష్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. చిన్నతనం నుంచి తీవ్ర అనారోగ్యం, అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న ఓ చిన్నారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 20 వేలు సహా
మంత్రి సుభాష్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. చిన్నతనం నుంచి తీవ్ర అనారోగ్యం, అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్న ఓ చిన్నారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ. 20 వేలు సహాయం చేసి ఆపన్న హస్తం అందించారు. వివరాల్లోకి వెళితే పిఠాపురం నియోజకవర్గo చేబ్రోలు గ్రామానికి చెందిన పెంకే మహాలక్ష్మి చిన్నతనం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందినవారు కావడంతో వారి ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేక అవస్థలు పడుతున్నారు. చిన్నారి ఒక ఆరోగ్య సమస్యలు, వారి ఆర్థిక సమస్యలు తెలుసుకున్న మంత్రి సుభాష్ మానవతా దృక్పథంతో తక్షణసాయంగా
రూ. 20 వేలు చెక్కు రూపంలో అందించారు. మంత్రి సేవా నిరతికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.