News18th Nov 11:03 AMSunil Byrisetty1 min read

సోలార్ విద్యుత్ తో సొమ్ము ఆదా

రామచంద్రపురం బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి సోలార్ యూనిట్ ను కార్మిక శాఖ మంత్రి సుభాష్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చాలా సోలార్ విద్యుత్ వినియోగించుకుని విద్యుత్, డబ

సోలార్ విద్యుత్ తో  సొమ్ము ఆదా
రామచంద్రపురం బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన గోదావరి సోలార్ యూనిట్ ను కార్మిక శాఖ మంత్రి సుభాష్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చాలా సోలార్ విద్యుత్ వినియోగించుకుని విద్యుత్, డబ్బులు ఆదా చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సోలార్ ద్వారా విద్యుత్తు వినియోగించు కోవడానికి పీఎం సూర్య ఘర్ పథకము ద్వారా సబ్సిడీ ఇస్తుందన్నారు. సోలార్ ద్వారా వన్ కేవికి 120 యూనిట్లు విద్యుత్ జనరేట్ అవుతుందని, దీనివల్ల ప్రతి ఏటా ఎనిమిది వేల రూపాయలు ఆదా ఆవుతుందన్నారు. దీనికి ప్రభుత్వం 35 వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుందన్నారు. అలాగే 2kv కి 250 నుంచి 300 యూనిట్ల వరకు విద్యుత్ జనరేట్ అవుతుందన్నారు. దీనివల్ల 20 వేల రూపాయలు ఆదా ఆవుతుందన్నారు. దీనికి సబ్సిడీ రూ.60 వేలు ఇస్తుందన్నారు. 3కేవీ కి 75 వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందన్నారు. ఎస్సీలకు పూర్తిగా ఉచితంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తుందన్నారు.
Andhra Pradesh
Solar Energy
Renewable Energy
PM Surya Ghar Scheme
Government Subsidy
Andhra Pradesh News
Ramachandrapuram
Minister Subhash
Solar Savings
Clean Energy
SC Free Solar Scheme
Scroll for the next article