News3rd Nov 02:55 PMSunil Byrisetty1 min read
108 మొక్కలు నాటిన మంత్రి సుభాష్
మానవ మనుగడకు చెట్లే ఆధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం రామచంద్రపురం శ్రీ బాలా త్రిపు
మానవ మనుగడకు చెట్లే ఆధారమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం రామచంద్రపురం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న నందివాడ సత్యనారాయణరావు ఉద్యానవనమునందు కార్తీక మాసం పర్వదినమున శివ సంకల్పంతో మంత్రి సుభాష్ చేతుల మీదుగా 108 మారేడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ సమాజంలో ప్లాస్టిక్ వినియోగం పెరిగి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందన్నారు. నాటిన మొక్కలు పెరిగి పెద్దవి అయ్యేంతవరకు తగిన సంరక్షణ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ రాజు, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, ఎస్ కే పి పి ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు,శ్రీ అగస్త్య స్వామి దేవాలయం ట్రస్ట్ చైర్మన్ గణేష్ శర్మ, పలువురు భక్తుల పాల్గొన్నారు. అనంతరం 2026 సంవత్సరానికి గాను రూపొందించిన క్యాలెండర్ ను మంత్రి సుభాష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.