News16th Aug 04:17 PMSunil Byrisetty1 min read

చేనేత రంగానికి పూర్వ వైభవం

చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చి, వారి బతుకుల్లో నూతన వెలుగులు తీసుకొస్తామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిన చేనేత రంగా

చేనేత రంగానికి పూర్వ వైభవం
చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చి, వారి బతుకుల్లో నూతన వెలుగులు తీసుకొస్తామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిన చేనేత రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు జవసత్వాలు తీసుకొచ్చేందుకు మగ్గానికి 200, మరమగ్గానికి 500 యూనిట్లు విద్యుత్ రాయితీని ప్రకటించడంతో నేతనాలకు మేలు జరుగుతుందన్నారు. త్రిప్టు రుణాలు మంజూరు చేస్తూ ఆప్కో ద్వారా విక్రయాలు మరలా పునరు ద్ధరించేలా చర్యలు చేపట్టడంతో పాటు, డ్రాయల్ లిమిట్ 75% నుంచి 90 శాతానికి పెంచాలని, ఆప్కోలో పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం కింద రూ.25 వేలు ఆర్థిక సహాయాన్ని వెంటనే ఇచ్చేలా కృషి చేయాలన్నారు. వెంటనే మంత్రి సుభాష్ స్పందిస్తూ చేనేత కార్మికులు కూటమి ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచారని వారి సంక్షేమానికి అన్ని విధాలుగా ముఖ్య మంత్రి ప్రత్యేక చొరవతో కృషి చేయడం జరుగుతుందన్నారు. అలాగే 50 ఏళ్లు వయసు పైబడిన నేతన్నలకు రూ. 4 వేల పింఛన్ ఇస్తున్నామన్నారు. నూలు కొనుగోలుపై సబ్సిడీ, క్లస్టర్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి, చేనేత శాలల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతుందన్నారు. చేనేత కార్మికుల నైపుణ్యం వెలికి తీసే ఉద్దేశంతో నూతన డిజైన్లు దరఖాస్తులు ప్రభుత్వం ఆహ్వానిస్తుందన్నారు. ఒక జిల్లా ఒకే ఉత్పత్తి పథకానికి సంబంధించి కేంద్రం నుండి 26 అవార్డులు ప్రకటించగా మన రాష్ట్రానికి 9 అవార్డులు దక్కాయని వాటిలో 4 అవార్డులు చేనేత రంగానికి సంబంధించి రావడం గర్వకారణమన్నారు.
Andhra Pradesh
Handloom Sector
Weavers Welfare
Minister Vasamsetti Subhash
Chandrababu Naidu
Electricity Subsidy
APCO
Triptu Loans
Nehtanna Nestham
నూలు సబ్సిడీ
క్లస్టర్ టెక్స్టైల్ పార్క్
చేనేత అభివృద్ధి
Scroll for the next article