News13th Aug 05:37 PMSunil Byrisetty1 min read

ఎస్సీ కార్పొరేషన్ వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి స్వామి

ఎస్సీ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ ను మంత్రి డిఎస్ బీవీ స్వామి ప్రారంభించారు. వెబ్ సైట్ లో పలు కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండనుంది. ఆయా

ఎస్సీ కార్పొరేషన్ వెబ్ సైట్ ప్రారంభించిన మంత్రి స్వామి
ఎస్సీ కార్పొరేషన్ అధికారిక వెబ్ సైట్ ను మంత్రి డిఎస్ బీవీ స్వామి ప్రారంభించారు. వెబ్ సైట్ లో పలు కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండనుంది. ఆయా పథకాలకు సులభతరంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్ రూపకల్పన చేశారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయిల్ లాంగ్వేజ్ లో ఉచిత శిక్షణకు వెబ్సైట్లో దరఖాస్తుకు అవకాశం లభించనుంది. నిరుద్యోగ ఎస్సీ యువత నైపుణ్య శిక్షణకు వెబ్సైట్లో దరఖాస్తుకు అవకాశాలున్నాయి. వెబ్ సైట్ ని ఔత్సాహికులు ఉపయోగించుకొని ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.
Ap government
SC Corporation
DSBV Swamy
Welfare Schemes
Andhra Pradesh
SC Welfare
Online Registration
జర్మన్ భాష శిక్షణ
ఇజ్రాయిల్ భాష శిక్షణ
ఉపాధి అవకాశాలు
సామాజిక సంక్షేమం
Scroll for the next article