News28th Oct 03:34 PMSunil Byrisetty1 min read

కూలిన భారీ చెట్లు.. సహాయక చర్యల్లో మంత్రి సుభాష్

తుఫాను ప్రభావంతో భారీగా వీచిన బలమైన గాలులకు రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం కోలంక, గొల్లపాలెం గ్రామంల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ జనసంచారం

కూలిన భారీ చెట్లు.. సహాయక చర్యల్లో మంత్రి సుభాష్
తుఫాను ప్రభావంతో భారీగా వీచిన బలమైన గాలులకు రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం కోలంక, గొల్లపాలెం గ్రామంల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అదే సమయంలో కోలంక రోడ్లో ప్రయాణిస్తున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అప్రమత్తమై అధికారులను పిలిపించి దగ్గరుండి, చెట్టును తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి దగ్గరుండి సహాయకచర్య లో పాల్గొనడంతో ఆగ మేఘాల మీద చెట్టును యంత్రాలతో తొలగించారు. అలాగే గొల్లపాలెంలో కూడా చెట్లు కూలడంతో మంత్రి సుభాష్ అధికారులను అప్రమత్తం చేసి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి మండలంలోని పలు పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు. విపత్కర పరిస్తితులను ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వo సన్నద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
Andhra Pradesh
Subhash Vasamsetti
Cyclone Damage
Fallen Trees
Relief Operations
Ramachandrapuram
Kajuluru Mandal
Kollanka Village
Gollapalem Village
విపత్తు నిర్వహణ
ప్రభుత్వ సహాయం
మంత్రి సందర్శన
ప్రజల భద్రత
Scroll for the next article