News29th Jul 10:11 AMSunil Byrisetty1 min read
ఉద్యోగాల పేరుతో మోసం.. మంత్రి అండ
డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్యోగాల పేరుతో దళారుల చేతిలో మోసపోయిన బాధితులకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అండగా నిలిచారు. అమలాపురంలో మహేష్ అనే వ్యక్తి ఉద్
డా. బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్యోగాల పేరుతో దళారుల చేతిలో మోసపోయిన బాధితులకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అండగా నిలిచారు. అమలాపురంలో మహేష్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులు దగ్గర లక్షల్లో సొమ్మును వసూలు చేసి మోసం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన బాధితులు దళిత నాయకులు రవ్వా భూషణం, కాటే సుబ్రమణ్యం ఆధ్వర్యంలో మంత్రి సుభాష్ ను రామచంద్రపురంలో కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. వారి సమస్యలు సావధానంగా విన్న మంత్రి సుభాష్ తక్షణం స్పందిస్తూ దీనస్థితిలో ఉన్న ఇద్దరు మహిళా బాధితులకు తక్షణసాయంగా రూ.50 వేలు అందించారు. మిగిలిన సొమ్ము కూడా రికవరీ అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మిగిలిన బాధితులందరి గోడు విని, ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసే వ్యక్తులను ఎవరూ నమ్మొద్దని సూచించారు. మోసపోయిన బాధితులందరికీ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.