News2nd Nov 12:32 PMSunil Byrisetty1 min read

పేదరికం చదువుకు ఆటంకం కాకూడదు

ప్రతిభావంతులైన పదవతరగతి విద్యార్థులను దత్తత తీసుకుని వారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత ఇంటర్ విద్య అందజేసే ఉద్దేశంతో రూపొందించిన "మోడరన్ గేట్ వే -2026-27 "కరపత్రాన్ని రాష్ట్ర కార్

పేదరికం చదువుకు ఆటంకం కాకూడదు
ప్రతిభావంతులైన పదవతరగతి విద్యార్థులను దత్తత తీసుకుని వారికి ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉచిత ఇంటర్ విద్య అందజేసే ఉద్దేశంతో రూపొందించిన "మోడరన్ గేట్ వే -2026-27 "కరపత్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో మాణిక్యాల వంటి విద్యార్థులను తీర్చిదిద్దుతున్న మోడరన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయన్ జి.వి.రావు ప్రయత్నం అందరికీ ఆదర్శప్రాయం అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ తో కూడిన ఉచిత ఇంటర్ విద్య అందజేయడం అభినందనీయమన్నారు. అనంతరం మోడరన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లయన్ జి.వి.రావు మాట్లాడుతూ పేదరికం చదువుకు ఆటంకం కారాదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ తో కూడిన ఉచిత ఇంటర్ విద్య అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ పి. ఎస్. ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Education
Scholarship
Modern Institutions
Minister Subhash
Student Support
ఉచిత ఇంటర్ విద్య
గ్రామీణ ప్రతిభ
జి.వి.రావు
మోడరన్ గేట్‌వే 2026
Scroll for the next article