News12th Jul 04:01 PMSunil Byrisetty1 min read

దాతల భూముల్ని ఆక్రమించుకుంటే ఉపేక్షించబోం!

పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతో దాతలు ఇచ్చిన భూముల్ని ఆక్రమించుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని శ్రీ తమ్మన పిచ్చయ్యగారి ధర్మ

దాతల భూముల్ని ఆక్రమించుకుంటే ఉపేక్షించబోం!
పేదలకు మేలు చేయాలనే లక్ష్యంతో దాతలు ఇచ్చిన భూముల్ని ఆక్రమించుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని శ్రీ తమ్మన పిచ్చయ్యగారి ధర్మ సత్రం అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అభాగ్యులకు అండగా నిలిచే లక్ష్యంతో దాతలు సత్రాలు నిర్మించారు. అలాంటి పేదలకు ఉపయోగకరంగా నిలిచే భూముల్ని కూడా కొందరు స్వార్ధ శక్తులు ఆక్రమించుకుంటున్నారు. దేవాలయాల భూములు, అపరకర్మభూములు, విద్య సంస్థల భూముల్ని ఆక్రమించుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. తమ్మన పిచ్చయ్య 1917 సంవత్సరంలో అపరకర్మల కోసం సత్రం ఏర్పాటు చేయగా, వారి వారసులు కూడా అంతే చిత్తశుద్ధితో నిర్వహించారని గుర్తు చేశారు. ఆ సత్రాన్ని కాపాడుకునేందుకు తన వంతుగా సత్రం అభివృద్ధికి రూ.5 లక్షలు ఆర్ధిక సాయం అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. అవసరమైతే దేవాదాయ శాఖ నుండి కూడా నిధులు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. త్వరలోనే అధునాత సదుపాయాలతో భవనం నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.
Andhra Pradesh
Kollu Ravindra
Machilipatnam
Donated Lands
Land Encroachment
Dharma Satram
దేవాదాయ శాఖ
సేవా సంస్థలు
దేవాలయ భూములు
ప్రజా సంక్షేమం
Scroll for the next article