News11th Nov 01:05 PMSunil Byrisetty1 min read

పుట్టపర్తి చేరుకున్న ఉత్సవ కమిటీ

శ్రీ భగవాన్ సత్యసాయి జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు బృందం పుట్టపర్తి చేరుకుంది. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని.. పుట్టపర్తిలో చేపట

పుట్టపర్తి చేరుకున్న ఉత్సవ కమిటీ
శ్రీ భగవాన్ సత్యసాయి జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు బృందం పుట్టపర్తి చేరుకుంది. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని.. పుట్టపర్తిలో చేపట్టిన పనుల పరిశీలన నిమిత్తం.. మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణ బాబు, అజయ్ జైన్ పుట్టపర్తి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, జేసి మౌర్య భరద్వాజ్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఇతర అధికారులు ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాష్ట్ర మంత్రుల బృందం మరియు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పుట్టపర్తిలోని ఆశ్రమం చేరుకొని.. సాయి కుల్వంత్ హాలులో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మహా సమాధిని దర్శించుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
Andhra Pradesh
Ministers Visit
Puttaparthi
Sathya Sai Baba
Centenary Celebrations
Government Officials
Ashram
ఆశ్రమం
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
సమాధి దర్శనం
రాష్ట్ర కార్యక్రమం
Scroll for the next article