News10th May 03:41 PMSunil Byrisetty1 min read

వీర జ‌వాను ముర‌ళీ నాయ‌క్ అంత్యక్రియ‌ల‌కు మంత్రులు!

దేశ ర‌క్ష‌ణ కోసం పాకిస్తాన్ సేన‌ల‌తో పోరాడుతూ అసువులు బాసిన వీర సైనికుడు ముర‌ళీ నాయ‌క్‌కు వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ నివాళులు అర్పించారు. ముర‌ళీనాయ‌క్ మృతి

వీర జ‌వాను ముర‌ళీ నాయ‌క్ అంత్యక్రియ‌ల‌కు మంత్రులు!
దేశ ర‌క్ష‌ణ కోసం పాకిస్తాన్ సేన‌ల‌తో పోరాడుతూ అసువులు బాసిన వీర సైనికుడు ముర‌ళీ నాయ‌క్‌కు వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ నివాళులు అర్పించారు. ముర‌ళీనాయ‌క్ మృతి ప‌ట్ల మంత్రి ప్ర‌గాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి సానుభూతిని తెలియ‌జేసి వీర సైనికుని కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ముర‌ళీనాయ‌క్ అంత్య‌క్రియ‌ల‌కు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ హాజ‌ర‌వుతారు. శ్రీ స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల మండ‌లం క‌ల్లితాండ గ్రామంలో అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయి.
Andhra Pradesh
Jawan Murali Naik Funeral
Operation Sindoor
అంత్య‌క్రియ‌ల‌కు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
విద్య
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
శ్రీ స‌త్య‌సాయి జిల్లా గోరంట్ల
శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ నివాళులు అర్పించారు
Scroll for the next article