News12th Sep 10:55 AMSunil Byrisetty1 min read
న్యూ రాజరాజేశ్వరి పేటలో మంత్రుల పర్యటన
న్యూ రాజరాజేశ్వరి పేటలో డయరియా కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా
న్యూ రాజరాజేశ్వరి పేటలో డయరియా కేసులు పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీ శా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర, డీఎంహెచ్‌వో సుహాసిని తదితర అధికారులు కూడా వారితో కలసి పర్యటనలో పాల్గొన్నారు. మంత్రులు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలంటూ వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు.
తరువాత జిల్లా అధికారులతో కలిసి మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. శానిటేషన్, శుద్ధి చేసిన తాగునీటి సరఫరా, వైద్య బృందాల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు ఆ సమావేశంలో సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు.