News22nd Jul 10:26 AMSunil Byrisetty1 min read

ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రుల కమిటీ సమావేశం

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశం నిర్వహించనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్,

ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రుల కమిటీ సమావేశం
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సమావేశం నిర్వహించనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ హాజరు కానున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తమకు రావాల్సిన బకాయిలు, డీఏలు, పీఆర్సీ సహా పలు డిమాండ్లపై గళం విప్పుతున్న ఉద్యోగులతో ప్రభుత్వం చర్చల ప్రక్రియను వేగవంతం చేసింది. మొత్తం 23 డిమాండ్లపై మంత్రులు చర్చించనున్నారు. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ఉద్యోగ సంఘాలతో చర్చ జరగనుంది.
Andhra Pradesh
Employee Unions
PRC
Dearness Allowance
Government Employees
Pensioners
మంత్రివర్గ ఉపసంఘం
ఉద్యోగుల సమస్యలు
Scroll for the next article