News18th Jun 01:45 PMSunil Byrisetty1 min read
సచివాలయంలో మంత్రి అచ్చెన్న సమీక్ష
సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. మామిడి, కోకో, పొగాకు పంటల మద్దతు ధరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, ప్
సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. మామిడి, కోకో, పొగాకు పంటల మద్దతు ధరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయా పంటల కనీస మద్దతు ధరపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిర్వహించే సమీక్షలో వివరించాల్సిన అంశాలపై సుదీర్ఘంగా సమీక్షలో చర్చించారు.