News28th Jan 11:44 AMSunil Byrisetty1 min read

ప్రజలపై భారం తగ్గించాలి

అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంత ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి మరో మంత్రి మండ

ప్రజలపై భారం తగ్గించాలి
అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంత ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి మరో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో మంత్రి సత్యప్రసాద్ ని కలిసి మాట్లాడిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గతంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉన్న సమయంలో రిజిస్ట్రేషన్ విలువలను 200 నుంచి 300 శాతం వరకు పెంచడం జరిగిందని, జిల్లా కేంద్రం మారినప్పటికీ అదే విలువలు కొనసాగడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. వాస్తవ భూమి విలువలకు మించి మార్కెట్ విలువలు నిర్ణయించడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. అలాగే 01-02-2026 నుంచి భూముల మార్కెట్ విలువను మరింత పెంచే ప్రతిపాదన అమలులోకి వస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని, దీని ప్రభావం ప్రజల ఆర్థిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని మంత్రి స్పష్టం చేశారు.
Andhra Pradesh
Rayachoti
Annamayya District
Real Estate
Land Registration
Registration Values
Stamp Duty
Revenue Department
మంత్రి అనగాని సత్యప్రసాద్
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Scroll for the next article