News26th Jun 11:29 AMSunil Byrisetty1 min read
ఏపీ పోలీసులకు అరుదైన గౌరవం
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి "సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్" లభించింది. రాష్ట్ర ప్రజల పాస్‌పోర్ట్ దరఖాస్తులను వేగంగా, సమర్థవంతంగా వెరిఫై చేసి
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి "సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నైజేషన్" లభించింది. రాష్ట్ర ప్రజల పాస్‌పోర్ట్ దరఖాస్తులను వేగంగా, సమర్థవంతంగా వెరిఫై చేసినందుకు ఈ అవార్డును అందించారు. ఢిల్లీలో జరిగిన 13వ పాస్‌పోర్ట్ సేవా దినోత్సవంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఏపీ పోలీసులు కేవలం 3 రోజుల్లో 6.25 లక్షల పోలీస్ వెరిఫికేషన్ రిపోర్టులు పూర్తి చేసి రికార్డు సృష్టించారు. ఈ వేడుకలో ఏపీకి మొత్తం మూడు విభాగాల్లో అవార్డులు దక్కాయి: పోలీసు విభాగం అవార్డు గుంటూరు పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం.. విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి. రెండోసారి AP పోలీసులకు ఈ గుర్తింపు లభించింది; గతంలో 2018-19లో కూడా ఈ అవార్డు వచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌కు ఇది నిదర్శనమన్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ ఎ. రమాదేవి విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీట చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.