Spiritual12th Nov 05:56 PMSunil Byrisetty1 min read
శ్రీకాళహస్తి ఆలయ పోటులో స్వల్ప అగ్నిప్రమాదం
శ్రీకాళహస్తి ఆలయ పోటులో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం
శ్రీకాళహస్తి ఆలయ పోటులో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రసాదాలు తయారుచేసే పోటులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. పోటులో నూనెకు సంబంధించిన పదార్థాలు అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది, దేవస్థానం అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది.