Crime10th Mar 12:47 PMSunil Byrisetty1 min read
ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. 2018 14 సెప్టెంబర్‌న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. హత్య కోసం ఉగ్రవాది అస్గర్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది.
2018 14 సెప్టెంబర్‌న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది.
హత్య కోసం ఉగ్రవాది అస్గర్ అలీకి అమృత తండ్రి మారుతీరావు సుపారీ ఇచ్చారు.
ఏడుగురితో గ్యాంగ్‌ను అస్గర్ అలీ ఏర్పాటు చేశాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నిందితులతో కలిపి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు.
ఈ కేసులో రెండవ అదనపు సెషన్ & ఎస్పీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి రోజా రమణి తుది తీర్పు వెల్లడించారు.
ఏ2 నిందితుడు సుభాష్ శర్మకు ఉరి శిక్ష, మిగతా ఆరుగురు నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సంచలన తీర్పు వెల్లడించారు.