News24th Jan 10:46 AMSunil Byrisetty1 min read

స్మార్ట్ మీట‌ర్ల‌పై అపోహ‌లు తొల‌గాలి

స్మార్ట్ మీట‌ర్ల వినియోగంతో క‌రెంట్ బిల్లు ఎక్కువ వ‌స్తుంది, న‌ష్టం జ‌రుగుతుంద‌నేది కేవ‌లం అపోహ మాత్ర‌మేన‌ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్ప‌ష్టం చేశారు. అభివృద్ధి దిశ‌గా మార్పులు

స్మార్ట్ మీట‌ర్ల‌పై అపోహ‌లు తొల‌గాలి
స్మార్ట్ మీట‌ర్ల వినియోగంతో క‌రెంట్ బిల్లు ఎక్కువ వ‌స్తుంది, న‌ష్టం జ‌రుగుతుంద‌నేది కేవ‌లం అపోహ మాత్ర‌మేన‌ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్ప‌ష్టం చేశారు. అభివృద్ధి దిశ‌గా మార్పులు జ‌రిగే స‌మ‌యంలో కొన్ని అపోహ‌లు వ‌స్తుంటాయ‌న్నారు. విద్యుత్ సిబ్బంది, ఇంజ‌నీర్లు స్మార్ట్ మీట‌ర్ల వినియోగం విష‌యంలో ప్ర‌జ‌ల‌ను ఎడ్యుకేట్ చేయాల‌ని పిలుపునిచ్చారు. వినియోగ‌దారుల సందేహాల‌ను నివృత్తి చేయాల‌న్నారు. ముందుగా పారిశ్రామిక అవ‌స‌రాల‌కు స్మార్ట్ మీట‌ర్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. గృహ అవ‌స‌రాల నిమిత్తం స్మార్ట్ మీట‌ర్ల‌ను బిగించే స‌మ‌యంలో వినియోగ‌దారుల‌కు చెప్పే చేస్తార‌ని తెలిపారు. పాత మీట‌ర్ కూడా ఉంచి ప‌క్క‌న‌ కొత్త స్మార్ట్ మీట‌ర్ బిగిస్తార‌ని, దీని వ‌ల్ల క‌రెంట్ బిల్లు ఎంత వ‌స్తుందో తెలుస్తుంద‌న్నారు. అంతే కాకుండా ఏ స‌మ‌యంలో ఎంత విద్యుత్ వినియోగించామో కూడా తెలుస్తుంద‌న్నారు. దీనితో విద్యుత్ ను ప్రణాళికాబ‌ద్ధంగా వినియోగించుకునే వెసులుబాటు స్మార్ట్ మీట‌ర్ల వ‌ల‌న ప్ర‌జ‌ల‌కు ల‌భిస్తుంద‌న్నారు.
Andhra Pradesh
Smart meters
Electricity bills
Power consumption
Energy department
Andhra Pradesh
Gottipati Ravi Kumar
వినియోగదారుల అవగాహన
విద్యుత్ నిర్వహణ
పారిశ్రామిక విద్యుత్
గృహ విద్యుత్
Scroll for the next article