Telangana28th May 04:18 PMSunil Byrisetty1 min read
మిస్ వరల్డ్ ఫైనల్స్.. అదరహో!
హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు అదరహో అనిపిస్తున్నాయి. 120 దేశాల్లో లైవ్.. సహా సీఎం, మంత్రులు, ప్రముఖుల హాజరుతో హోరెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025
హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు అదరహో అనిపిస్తున్నాయి. 120 దేశాల్లో లైవ్.. సహా సీఎం, మంత్రులు, ప్రముఖుల హాజరుతో హోరెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ 72వ మిస్ వరల్డ్ ఫైనల్స్ మే 31న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనున్నాయి. సాయంత్రం 5:30 గంటలకు రెడ్ కార్పెట్ ఈవెంట్‌తో ఈ ఫైనల్స్ ప్రారంభమవుతాయి. రాత్రి 9.30 గంటలకు ముగుస్తాయి. అప్పుడే నెక్ట్స్ మిస్ వరల్డ్‌కి కిరీటధారణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సోనీ టీవీ 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు సహా 3,500 మంది ప్రేక్షకులు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరవుతారని అంచనా. తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యం, ఆధునికతను ప్రదర్శించే ఈ కార్యక్రమం, రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా నిలపాలనే లక్ష్యంతో జరుగుతోంది.