News6th Oct 12:59 PMSunil Byrisetty1 min read

ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ!

ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రానుంది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.1,200 కోట్లతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు 1,400 ఎకరాలు కేటా

ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ!
ఏపీకి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ రానుంది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.1,200 కోట్లతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు 1,400 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదనలు పంపింది. దీని ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా 1,000 మందికి ఉపాధి లభించనుంది. భారత రక్షణ వ్యవస్థకు అవసరమైన మిసైళ్లు, ఇతర ఆయుధాలను DRDOతో కలిసి BDL తయారు చేయనుంది. 2028 SEP నాటికి ఇది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బీడీఎల్ సంస్థ వస్తే అనేక అనుబంధ పరిశ్రమలు ఆ ప్రాంతంలో ఏర్పాటై అభివృద్ధి పరుగులు తీయనుంది.
Andhra Pradesh
Prakasam District
Donakonda
BDL
Bharat Dynamics Limited
Defence Industry
DRDO
Missile Manufacturing
Employment
Industrial Development
మేక్ ఇన్ ఇండియా
పెట్టుబడులు
మౌలిక వసతులు
ఆర్థిక పురోగతి
Scroll for the next article