News20th Jul 03:54 PMSunil Byrisetty1 min read
తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు
నంద్యాల పోలీసుల అప్రమత్తతతో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి ప్రణవిని సురక్షితంగా గుర్తించి రక్షించారు. ఆదివారం సాయంత్రం 7.00 గంటల సమయంలో చిన్నారి ప్రణవి కనపడకుండా పోయింది. రాత్రి 9 గ
నంద్యాల పోలీసుల అప్రమత్తతతో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి ప్రణవిని సురక్షితంగా గుర్తించి రక్షించారు. ఆదివారం సాయంత్రం 7.00 గంటల సమయంలో చిన్నారి ప్రణవి కనపడకుండా పోయింది. రాత్రి 9 గంటలకు డయల్-112కు సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వైఎస్సార్ నగర్ పరిసరాల్లో రాత్రంతా విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకుని స్వయంగా జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఏఎస్పీ సుస్మిత ఆధ్వర్యంలో ప్రత్యేక గాలింపు బృందాల ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ సహాయంతో ముమ్మరంగా గాలించారు. తెల్లవారుజామున వైఎస్సార్ నగర్ వెలుపల పొలాల్లో చిన్నారిని సురక్షితంగా గుర్తించి, తల్లి కళ్యాణికి క్షేమంగా అప్పగించారు. డయల్-112కు సకాలంలో సమాచారం ఇవ్వడంతోనే వేగంగా స్పందించగలిగామని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు.