National21st Aug 04:14 PMSunil Byrisetty1 min read

నేను తెచ్చిన సమాచారం గగన్‌యాన్‌కు ఉపయోగం

అంతరిక్షం నుంచి భూమిని చూస్తే అద్భుతంగా అనిపించిందని భారత వ్యోమగామి కెప్టెన్‌ శుభాంశు శుక్లా తెలిపారు. ఐఎస్ఎస్‌ నుంచి కొన్ని ఫొటోలు తీసుకొచ్చామని చెప్పారు. ఈ మిషన్‌ కోసం మన శాస్త్ర

నేను తెచ్చిన సమాచారం గగన్‌యాన్‌కు ఉపయోగం
అంతరిక్షం నుంచి భూమిని చూస్తే అద్భుతంగా అనిపించిందని భారత వ్యోమగామి కెప్టెన్‌ శుభాంశు శుక్లా తెలిపారు. ఐఎస్ఎస్‌ నుంచి కొన్ని ఫొటోలు తీసుకొచ్చామని చెప్పారు. ఈ మిషన్‌ కోసం మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారన్నారు. అంతరిక్ష యానం కోసం చాలా శిక్షణ తీసుకున్నానని చెప్పారు. ఏడాదిగా ఈ మిషన్‌ కోసం ఎంతో సమాచారం సేకరించానని తెలిపారు. తాను సేకరించిన సమాచారం గగన్‌యాన్‌ మిషన్‌ కోసం పనికొస్తుందన్నారు. భారతీయుల కలలను నెరవేర్చడం గర్వకారణమన్నారు. అంతరిక్ష యానం కోసం శరీరాన్ని సిద్ధం చేసుకోవడం మరిచిపోలేని అనుభవమని శుభాంశు శుక్లా గుర్తు చేసుకున్నారు.
Indian space achievements
Gaganyaan Mission
Indian astronaut
Shubhanshu Shukla
ISRO
Space mission India
ISS photos
Space research
India in space
astronaut training
Scroll for the next article