News29th Sep 11:55 AMSunil Byrisetty1 min read

కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహిస్తోన్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించే కార్యక్రమానికి ఏపీ

కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహిస్తోన్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించే కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాలు మెరుగు పరచడమే లక్ష్యంగా మిషన్‌ కర్మయోగి రెండు రోజుల వర్క్ షాప్ జరుగుతోంది. ప్రభుత్వ శిక్షణ సంస్థల కెపాసిటి బిల్డింగ్, ఉద్యోగుల నైపుణ్యం పెంపు అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్‌, మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్ వర్క్ భాగస్వామ్యంలో ముసాయిదా రూపకల్పన చేశారు.
Scroll for the next article