Politics22nd Jul 11:15 AMSunil Byrisetty1 min read
జైల్లో వసతుల కోసం కోర్టుకు మిథున్ రెడ్డి
రిమాండ్ ఖైదీగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రత్యేక వసతుల కో
రిమాండ్ ఖైదీగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మరోసారి కోర్టును ఆశ్రయించారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రత్యేక వసతుల కోసం రెండు పిటిషన్లు దాఖలు చేశారు. 3 పూటలా ఇంటి భోజనం, కిన్లే వాటర్ బాటిళ్లు, కొత్త పరుపుతో మంచం, దిండ్లు, వెస్ట్రన్ కమోడ్ గల ప్రత్యేక గది, టీవీ, సహాయకుడు, దినపత్రికలు, వాకింగ్ షూలు, దోమతెర తదితర వసతులు అందించాలని కోరారు. అలాగే యోగా మ్యాట్, ప్రొటీన్ పౌడర్, టేబుల్, తెల్లకాగితాలు, పెన్ను వంటి వస్తువులూ కావాలని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై కోర్టు విచారణ జరిపి, అభ్యంతరాలుంటే చెప్పాలనిసెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌ను ఆదేశించింది.