Politics21st Jul 05:57 PMSunil Byrisetty1 min read

చంద్రబాబు గదిలో మిథున్ రెడ్డి

ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్టైన వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిక

చంద్రబాబు గదిలో మిథున్ రెడ్డి
ఏపీ మద్యం కుంభకోణంలో అరెస్టైన వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ఖైదీ నెంబర్ 4196 కేటాయించారు. కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. గతంలో నంద్యాల పర్యటనలో ఉన్న నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్లోనే మిథున్ రెడ్డిని ఉంచినట్లు సమాచారం. మరోవైపు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు.
Andhra Pradesh news
ap politics
ycp
Mithun Reddy
AP Liquor Scam
Chandrababu Naidu
Rajahmundry Central Jail
Ycp MP Arrest
SIT Custody
ACB Court
Remand
Sneha block
చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్లోనే మిథున్ రెడ్డి
Scroll for the next article