Crime7th Apr 01:11 PMSunil Byrisetty1 min read
లిక్కర్ కుంభకోణంలో సుప్రీంకు మిథున్ రెడ్డి
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చ
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జస్టిస్ జేవీ పార్థీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.
వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ కుంభకోణం చోటుచేసుకుందని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో మిథున్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకపోయినా ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతోపాటు ఎఫ్ఐఆర్‌లో పేరు లేనప్పుడు బెయిల్ ఎలా ఇస్తామని ప్రశ్నించింది.
బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, ఆయన ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు