Politics25th Sep 03:52 PMSunil Byrisetty1 min read
అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ సీరియస్
అసెంబ్లీలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్ అయ్యారు. గతంలో చిరంజీవిని జగన్ అవమానించారని, చిరంజీవిని కలిసేందుకు జగన్ ఇష్టపడలేదని, చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగివచ్చారన
అసెంబ్లీలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్ అయ్యారు. గతంలో చిరంజీవిని జగన్ అవమానించారని, చిరంజీవిని కలిసేందుకు జగన్ ఇష్టపడలేదని, చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగివచ్చారని మరో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కామినేని ఉదాహరణను తప్పుబట్టిన బాలకృష్ణ చిరంజీవి గట్టిగాఅడిగితే జగన్ దిగివచ్చారన్నది అబద్ధమని తేల్చి చెప్పారు. ఎవరూ గట్టిగా అడగలేదన్నారు. కూటమి ప్రభుత్వం కూడా తనను అవమానించిందని, ఎఫ్డీసీ సమావేశంలో తన పేరు 9వ స్థానంలో పెట్టారని సీరియస్ అయ్యారు. ఆ లిస్ట్ ఎవరు తయారుచేశారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు ఫోన్ చేసి అడిగానని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.