News4th Sep 05:03 PMSunil Byrisetty1 min read
నిమ్మకూరులో బాలకృష్ణ సందడి
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు ఘన స్వాగతం లభించింది. గురుకుల విద్యార్థులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి, మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. అనంతరం ఆయన ఎన్టీఆర్
ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు ఘన స్వాగతం లభించింది. గురుకుల విద్యార్థులు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి, మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. అనంతరం ఆయన ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులర్పించారు. సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం గర్వకారణమని బాలయ్య వ్యాఖ్యానించారు. పదవుల కంటే ప్రజల ప్రేమే ముఖ్యమని, ఈ విజయాలు తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ ఉన్నత స్థితికి రావడంలో తల్లి బసవతారకం చేసిన త్యాగాలు ఎనలేనివని గుర్తుచేశారు.