Spiritual20th Jan 11:52 AMSunil Byrisetty1 min read

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి మహోత్సవంలో ఎమ్మెల్యే బొండా ఉమా

విజయవాడలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన “శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవము” కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర

శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి మహోత్సవంలో ఎమ్మెల్యే బొండా ఉమా
విజయవాడలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిర్వహించిన “శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విశ్వరూప సందర్శన మహోత్సవము” కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించి, 108 కలశములతో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఊరేగింపు, 108 సుగంధ పరిమళ ద్రవ్యములతో అభిషేకము ఘనంగా నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో భక్తులతో కలిసి పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా బొండా ఉమ గారు మాట్లాడుతూ పెనుగొండలో వాసవీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు విశేషంగా హాజరయ్యారు.
Sri Vasavi Kanyakaparameswari
Vishwaroopa Darshana Mahotsavam
Vijayawada
Bonda Uma Maheswara Rao
Government Whip
ప్రభుత్వ విప్
సెంట్రల్ నియోజకవర్గం
ఎమ్మెల్యే
గోపూజ
108 కలశాలు
అమ్మవారి ఊరేగింపు
Scroll for the next article