Politics3rd Jun 03:18 PMSunil Byrisetty1 min read
జగన్ కోసం రెచ్చిపోయిన సైకోలు: నరేంద్ర
మాజీ సీఎం జగన్ మరోసారి సైకోలను మానసికంగా సిద్ధం చేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెనాలిలో పోలీసు వాహనం మీద ఎక్కి సైకోల హాల్ చల్ జగన్ 2.0 క
మాజీ సీఎం జగన్ మరోసారి సైకోలను మానసికంగా సిద్ధం చేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెనాలిలో పోలీసు వాహనం మీద ఎక్కి సైకోల హాల్ చల్ జగన్ 2.0 కి నిదర్శనమన్నారు. జగన్ తెనాలి పర్యటనలో పోలీసు వాహనం మీద ఎక్కిన సైకోలు వికృత చేష్టలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇలాంటి పైశాచిక సైకోలకు మద్దతు పలకడానికి వెళ్లేందుకు సిగ్గుండాలన్నారు. ప్రజలు ధిక్కరించినా జగన్ వైఖరిలో మార్పు లేదని, జగన్ లాంటి వ్యక్తులకు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు, ప్రజాస్వామ్యంలో ఉండే హక్కు లేదని వ్యాఖ్యానించారు.
పోలీసులు వాహనం మీద హాల్ చల్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర డిమాండ్ చేశారు.