News20th Aug 05:04 PMSunil Byrisetty1 min read
జర్నలిస్టులకు హౌసింగ్ సౌకర్యం కల్పించాలి
జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి గళమెత్తారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలిచే జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, ప్రజా సమస్యలను, ప్రభుత్వ సంక్
జర్నలిస్టుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి గళమెత్తారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలిచే జర్నలిస్టులు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, ప్రజా సమస్యలను, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే కీలక బాధ్యతను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా విలేఖరుల్లో అధిక శాతం మంది అత్యల్ప వేతనాలతో పనిచేస్తున్నారని,సొంత ఇల్లు నిర్మించుకోవడం వారికి పెద్ద సవాల్‌గా మారిందని తెలిపారు. జర్నలిస్టుల వృత్తిలో స్థిరత్వం, నిర్దిష్టమైన పనివేళలు లేకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందించే ఆరోగ్య కార్డులు, గృహనిర్మాణ పథకాలు వంటి ప్రోత్సాహకాలు జర్నలిస్టుల కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పిస్తాయని వివరించారు.