News23rd Aug 01:12 PMSunil Byrisetty1 min read

స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి.

శృంగవరపుకోటలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. లక్కవరపుకోట మండలం గనివాడ గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా మురుగునీటిని

స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి.
శృంగవరపుకోటలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. లక్కవరపుకోట మండలం గనివాడ గ్రామంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా మురుగునీటిని, బురదను ఎమ్మెల్యే శుభ్రం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా వ్యాధులను నివారించవచ్చని పిలుపునిచ్చారు. ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలందరూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి.. స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. "సంపన్నమైన, పరిశుభ్రమైన మరియు ఆకుపచ్చ ఆంధ్రప్రదేశ్" కోసం అందరూ కలిసి కృషి చేయాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పిలుపునిచ్చారు.
Andhra Pradesh
Swachh Andhra
Clean Andhra
Sringavarapukota
Lakkavarapukota
Kollu Lalitha Kumari
Cleanliness Drive
Health Awareness
స్వచ్ఛాంధ్ర
ఆరోగ్య అవగాహన
Scroll for the next article