Politics23rd Aug 12:15 PMSunil Byrisetty1 min read
ఎమ్మెల్యే కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు
నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చానని చెప్పారు. శ్రీకాంత్ తండ్రి అడిగినందుకే లేఖ ఇచ్చానన్నారు. తాను
నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చానని చెప్పారు. శ్రీకాంత్ తండ్రి అడిగినందుకే లేఖ ఇచ్చానన్నారు. తాను ఇచ్చిన లేఖను అధికారులు తిరస్కరించారని చెప్పారు. పెరోల్ ఇవ్వలేమని లిఖితపూర్వకంగా చెప్పారని కోటంరెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుగా చాలామందికి లేఖలు ఇస్తుంటామన్నారు. గతంలో రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం.. చెవిరెడ్డి, కిలివేటి లేఖలు ఇచ్చారని కోటంరెడ్డి స్పష్టం చేశారు.