News25th Jan 03:03 PMSunil Byrisetty1 min read
ఉత్తరాంధ్ర కోసం సీఎం చంద్రబాబుకు వినతి!
ఉత్తరాంధ్ర రైతాంగ సాగునీటి కల, నెల్లిమర్ల నియోజకవర్గ జీవనాడి అయిన తారకరామ తీర్థ సాగర్ (TRTS) ప్రాజెక్టు పనులు పెట్టడానికి ఎమ్మెల్యే మాధవి లోకం నడుం బిగించారు. అమరావతిలో ముఖ్యమంత్రి
ఉత్తరాంధ్ర రైతాంగ సాగునీటి కల, నెల్లిమర్ల నియోజకవర్గ జీవనాడి అయిన తారకరామ తీర్థ సాగర్ (TRTS) ప్రాజెక్టు పనులు పెట్టడానికి ఎమ్మెల్యే మాధవి లోకం నడుం బిగించారు. అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాజెక్టు పెండింగ్ పనులు, నిధుల విడుదలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రాబోయే బడ్జెట్‌లో TRTS ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించబడ్డాయి, పనుల్లో జాప్యం లేకుండా చూడాలని కోరారు. ప్రాజెక్టు నిర్వాసితులకు అందాల్సిన సహాయం చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది, ఆ ప్యాకేజీని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాల (PAF) పూర్తిస్థాయి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరారు.
ఎమ్మెల్యే విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు అత్యంత సానుకూలంగా స్పందించారు.