Telangana5th Jun 06:08 PMSunil Byrisetty1 min read
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి
జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మృతి చెందినట్లు సమాచారం. ఆయన గుండెపోటుతో చనిపోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నింపింది. చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్
జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ మృతి చెందినట్లు సమాచారం. ఆయన గుండెపోటుతో చనిపోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నింపింది. చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు తరలించగా.. ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఆయనకు అనారోగ్యం అని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర నేతలు ఏఐజీ హాస్పిటల్కు వెళ్లారు. వైద్యుల చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని తెలిసింది. 2014, 2018, 2023లో ఆయన జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్ని నెలలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీ సమస్య కూడా ఆయన అనారోగ్యానికి కారణమైంది. ఏఐజీ ఆసుపత్రిలో గతంలో చికిత్స తీసుకున్న ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గురువారం ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గురువారం సాయంత్రం ఏఐజీలో ఆయన తుది శ్వాస విడిచారు.