Politics16th Jul 04:50 PMSunil Byrisetty1 min read
రాజనాల మళ్లీ పుట్టాడా అన్నట్లు జగన్!
జగన్ ప్రెస్ మీట్ పెట్టి, మాట్లాడిన తీరు చూస్తుంటే పాత సినిమాలో రాజనాల క్యారెక్టర్ గుర్తుకు వస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు విమర్శలు చేశారు. మంగళగ
జగన్ ప్రెస్ మీట్ పెట్టి, మాట్లాడిన తీరు చూస్తుంటే పాత సినిమాలో రాజనాల క్యారెక్టర్ గుర్తుకు వస్తుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో హత్యలు, దౌర్జన్యాలు చేసి నేడు ఏం తెలియనట్టు ప్రెస్ మీట్ లో కూర్చుకున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పు ప్రజా స్వామ్యంలో ఉన్నామా అనే ఆలోచన వచ్చేదన్నారు. నిరంకుశత్వంగా పరిపాలన సాగించడంతో 11 సీట్లకే పరిమితం చేసినా ప్రజలు ఇలాంటి తీర్పు ఎందుకు ఇచ్చారన్న ఆలోచన కూడా జగన్ చేయడం లేదని విమర్శించారు. అవసానదశలో ఉన్న పార్టీని బతికించుకోవాలనే ఆలోచనతో జగన్ మీడియా ముందుకు వస్తున్నారన్నారు. పోలీసులపై మాట్లాడేందుకు సిగ్గు ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయతీగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంటే వారిపై విమర్శలు చేయడం సిగ్గులేని తనమని, డీఐజీని పట్టుకొని మాఫియా డాన్ అనడంపై పోలీస్ సంఘాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు.