Politics3rd Mar 04:10 PMSunil Byrisetty1 min read
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్!
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు మొత్తం పది స్థానాలకు నేడు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈసీ. మార్చి10 వరకు నామినేషన్ దాఖల
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు మొత్తం పది స్థానాలకు నేడు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈసీ. మార్చి10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది. మార్చి 20వ తేదీన ఉదయం 09 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసెంబ్లీలో పోలింగ్ జరగనుంది, అదే రోజు సాయంత్రం5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. శాసనసభలో పార్టీలకున్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు, బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఐదుకు ఐదు స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి. ఇందులో టీడీపీకి మూడు, జనసేన,బీజేపీలకు చెరకోటి దక్కే అవకాశం ఉంది.